ETV Bharat / state

రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది: జడ్పీ ఛైర్​పర్సన్ - తెలంగాణ వార్తలు

నాగర్ కర్నూల్ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జడ్పీ ఛైర్​పర్సన్ పెద్దపల్లి పద్మావతి ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను నాణ్యత ప్రమాణాలకు లోబడి ప్రభుత్వం కొంటుందని తెలిపారు. జిల్లాలో 217 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

nagarkurnool zp chairperson, nagarkurnool grain purchase centres
నాగర్ కర్నూల్ జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, నాగర్ కర్నూల్ జడ్పీ ఛైర్​పర్సన్
author img

By

Published : Apr 17, 2021, 11:33 AM IST

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ పెద్దపల్లి పద్మావతి తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే కొవిడ్‌ నిబంధనలకు లోబడి జిల్లాలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సహకార మార్కెటింగ్ మెప్మా శాఖల అధికారులు, మిల్లర్లతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కమిటీ సభ్యులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ కృషితో జిల్లాలో నీటి వనరులు అభివృద్ధి చేశామని తెలిపారు. 1 లక్ష 57 వేల ఎకరాల్లో 3,63,515 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సాగుచేశారని ఆమె వెల్లడించారు.

జిల్లాలో 217 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతా ప్రమాణాలకు లోబడి కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. యాసంగిలో 2,94,447 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఐకేపీ 16, పీఏసీసీఎస్‌ 197, మార్కెట్‌ కమిటీ 4, మొత్తం 217 కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 40 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని... ఇంకా 33 లక్షలు అవసరమవుతాయని తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా కాటు: జీవన చక్రం ఆగింది.. బతుకు చిత్రం మారింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.