ETV Bharat / state

గొర్రెల లొల్లి: పంచాయతీ పెట్టి మరీ కొట్టుకున్నారు

author img

By

Published : Dec 26, 2020, 5:58 PM IST

మూగజీవాలు పంట చేను మేసిన విషయంలో జరిగిన వివాదం ఘర్షణకు దారి తీసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో జరిగింది. వారి ఘర్షణ ముష్టి యుద్ధాన్ని తలపించింది.

two mans fight in nagarkarnool district
గొర్రెల లొల్లి: పంచాయతీ పెట్టి మరీ కొట్టుకున్నారు

నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. తూడుకుర్తికి చెందిన మహేశ్​ గొర్రెలు అదే గ్రామానికి చెందిన నక్క శ్రీనివాసులు పంటను మేశాయి. శ్రీనివాసులు పరిహారం ఇప్పించాలని పంచాయతీ పెట్టాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ విచారణ మొదలైంది.

నక్క శ్రీనివాసులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నేను ఎందుకు చెల్లించాలి, నా ఒక్కడి గొర్రెలు చేనులో పడలేదు, చాలా మంది గొర్రెలు పడ్డాయి, నేను చెల్లించనని మహేశ్​ చెప్పటంతో గొడవ మొదలైంది.

ఆవేశానికి గురైన శ్రీనివాసులు మహేశ్​పై దాడికి పాల్పడ్డాడు. మహేశ్​ కూడా ప్రతి దాడికి దిగాడు. ఇరువురు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఒకరినొకరు దూషించుకుంటూ కిందపడి కొట్టుకున్నారు. గ్రామ పెద్దలు వారిని విడిపించాల్సి వచ్చింది.

దీ చదవండి: దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.