ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని టీఎస్ సీపీఎస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఇటీవల మృతి చెందిన ఎండీ ఖలీల్ కుటుంబాన్ని పరామర్శించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సంఘం తరపున లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని తెలిపారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. 2015 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదవశాత్తు మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు... సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నాజూకు అందం కావాలంటే ఇవి చేయాల్సిందే..!