నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక సంఘం పరిధిలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా పరిపాలనాధికారి శ్రీధర్ ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్లు స్వీకరించే 22 వార్డులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామపత్రాలు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థుల వద్ద అన్ని వివరాలు తీసుకోవాలన్నారు. వార్డు ఓటరు లిస్టు, పురపాలక సంఘానికి సంబంధించిన ఓటర్ల జాబితా ఉండాలని సూచించారు.
అభ్యర్థి నామినేషన్ పత్రాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే నామినేషన్‌కు అంగీకరించాలన్నారు. పురపాలక సంఘం కమిషనర్ బాలచంద్ర సృజన్‌తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేష్ కుమార్, తహశీల్దార్ రామ్ రెడ్డి, సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పనికి చేరారు.. మత్తుమందు పెట్టి మొత్తం ఊడ్చేశారు..