రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని ఓ చెరువులో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విడిచిపెట్టారు. చేపలను అందజేయడంతోపాటు... వాటిని అమ్ముకోవడం కోసం జిల్లాలోని మత్స్యకారులకు 9కోట్ల రూపాయల విలువైన వాహనాలను అందజేశామని తెలిపారు. ఐదు మండలాల్లోని 298 సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
'కులవృత్తులను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం'
కులవృత్తులను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తాడూరులో ప్రభుత్వం ఉచింతంగా పంపిణీ చేసిన చేప పిల్లలను స్థానిక చెరువులో వదిలారు.