భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. రాత్రి నుంచి కురుస్తున్న వానతో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నల్లమలలోని నార్లాపూర్, ముక్కిడిగుండం గ్రామాల సమీపంలోని పెద్దవాగు, ఉడుముల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉడుముల వాగు చుట్టూ పొలాలు, గొర్రెల మందలు ఉండటం వల్ల రైతులు.. ప్రవాహాన్ని దాటలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాకాలం వస్తే ఆయా గ్రామాల నుంచి కొల్లాపూర్ వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉందని.. గ్రామస్థులు, రైతులు వాపోయారు. రెండు వాగులపై వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: HYDERABAD RAIN EFFECT: రెండు రోజులుగా నీటిలోనే పలు కాలనీలు