నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చిన ఎంపీ రాములుకి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జలసాధన సమితి సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్వపు ప్రణాళిక ప్రకారం వెంటనే పూర్తిచేసి తాగు నీటిని అందించాలని వారు లేఖలో పేర్కొన్నారు.
కేఎల్ఐ పథకంలో కల్వకుర్తి ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఈ ప్రాంత రైతులు, ప్రజలకు న్యాయం చేయాలని ఎంపీని కోరారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జలసాధన సమితి కన్వీనర్ లక్ష్మణ శర్మ, కో కన్వీనర్ లింగం గౌడ్ పాల్గొన్నారు.