నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, లింగాల మండలాల్లోని అప్పాపూర్, మల్లాపూర్, చెంచుపేటలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పర్యటించారు. చెంచుల జీవన విధానం, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
చెంచులు తమకు నీళ్ల వసతి, విద్యా, వైద్య, వాహన సౌకర్యాలు లేవని, ఆంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కోరారు. తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
లాక్డౌన్లో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న చెంచులకు ఆర్డీటీఐసీడీఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.