కొందరు వ్యక్తులు తనపై పనిగట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్వేరోస్ వ్యవస్థాపకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో జరిగిన స్వేరోస్ జ్ఞాన యుద్ధభేరి సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. నాటి గురుకులాలకు నేటి గురుకులాలకు తేడా గమనించాలని చెప్పారు.
జ్ఞాన సమాజం కోసం..
గురుకుల పాఠశాల విద్యార్థుల ఉన్నతి కోసం పూర్వ విద్యార్థులు తోడ్పాటును అందిస్తున్నారని ఆయన అన్నారు. జ్ఞాన సమాజం కోసమే స్వేరోస్ పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్రం విద్య, వైద్య, ఆర్థిక రంగాల్లో ఎదగడమే స్వేరోస్ లక్ష్యమని చెప్పారు. పేద విద్యార్థులకు తమ వంతు చేయూతను అందిస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నేత సతీష్, సామాజిక కార్యకర్త అభిలాష రావు, బీసీ సంక్షేమ కార్యదర్శి మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నోముల కుమారుడికే నాగార్జునసాగర్ టికెట్!