ETV Bharat / state

సెల్ఫీ వైరల్: 'నేను చచ్చిపోతున్నా.. నా కోసం ఎవరూ వెతకొద్దు'

సారీ... దిస్ ఈజ్ మై లాస్ట్ మెసేజ్. ఎండ్ ఆఫ్ ది డే ఇన్ మై లైఫ్... గుడ్ బై... అంటూ ఓ వ్యక్తి పంపిన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది. అసలు ఈ వీడియో కథేంటంటే...

man suicide selfie video viral
నేను చచ్చిపోతున్నా.. నా కోసం ఎవరూ వెతకొద్దంటూ సెల్ఫీ వీడియో
author img

By

Published : Jul 21, 2020, 11:49 AM IST

Updated : Jul 21, 2020, 12:12 PM IST

ప్రశాంతమైన చల్లగాలి... చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం. ప్రస్తుతం నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఇదే నా చివరి వీడియో. నా కోసం ఎవరూ వెతకొద్దు. నేను ఇక్కడే చనిపోతాను... అంటూ ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టాడు.

కుటుంబ సమస్యలు తట్టకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మద్యం సేవిస్తూ మరీ గిరిజన లంబాడీ భాషలో చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మిథ్య తండాకు చెందిన హేమంత్ నాయక్... హైదరాబాద్​లో డ్రైవర్​గా పనిచేసుకుంటూ జీవనం సాసగించేవాడు.

ఇటీవలే స్వగ్రామానికి తిరిగివచ్చిన ఇతను... కుటుంబ కలహాల కారణంగా ఈ నెల 15న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

బంధువులు, స్నేహితుల దగ్గర ఉన్నాడేమోనని కనుక్కున్న కుటుంబ సభ్యులు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా... అదృశ్యమైన వ్యక్తి చివరగా మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంలో గాలిస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.

సెల్ఫీ వైరల్: 'నేను చచ్చిపోతున్నా.. నా కోసం ఎవరూ వెతకొద్దు'

ఇవీ చూడండి: 'దేశంలోనే తెలంగాణ అతి తక్కువ పరీక్షలు చేస్తుంది'

Last Updated : Jul 21, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.