ETV Bharat / state

యువత సేవా మార్గం... వివేకానందుడే స్ఫూర్తి మంత్రం.. - swamy vivekananda seva brundam in kalvakurthi

'యువతా మేలుకో' అన్న వివేకానందుని మాటలను ఆ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకున్నారు. స్థానికంగా ఉన్న యువతతో కలిసి ఒక బృందంగా ఏర్పడి ఇతరులు పట్ల సేవాభావాన్ని కలిగి ఉంటూ తమకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. శుభకార్యాల్లో మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి వాటిని నిరుపేదలకు పంచుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్​ మనీని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పట్టణ విద్యార్థులు, యువత.

వివేకానందుని స్ఫూర్తి
author img

By

Published : Sep 13, 2019, 8:40 AM IST

యువత సేవా మార్గం... వివేకానందుడే స్ఫూర్తి మంత్రం..

నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువత, విద్యార్థులు స్వామి వివేకానందుడు చూపిన బాటలో నడుస్తున్నారు. ఇతరుల పట్ల సేవా భావాన్ని అలవర్చుకోవాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని తు.చ. తప్పక పాటిస్తున్నారు. స్వామి వివేకానంద సేవా బృందం పేరిట సందర్భానుసారం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐదేళ్ల క్రితం పాఠశాల స్థాయిలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసుకున్న ఈ బృందం ఇతర ప్రాంతాల్లో కూడా తమకు తోచిన సాయం అందిస్తున్నారు. ఓ వైపు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే... సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం...

సేవా కార్యక్రమాల్లో చురుకుగా...

వివేకానంద సేవా బృందంలో పాఠశాల విద్యార్థులు, స్థానిక యువత సభ్యులుగా ఉన్నారు. తల్లిదండ్రులు తమకు ఇచ్చిన పాకెట్​ మనీని విద్యార్థులు సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. వసతి లేని పేద విద్యార్థులను గుర్తించి వారిని ఆదుకుంటున్నారు. తమ కాలనీలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛభారత్​ కార్యక్రమం చేపట్టి... వాటిని శుభ్రపరుస్తారు. మున్సిపల్​ అధికారులతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించేలా చూస్తున్నారు.

ఆహారం సేకరించి నిరుపేదలకు

శుభకార్యాలు, పుట్టినరోజు వేడుకల్లో మిగిలిన ఆహార పదార్థాలను వృథా చేయవద్దనే నినాదం తీసుకువచ్చి... అలా మిగిలితే తమకు తెలియజేయాలంటూ సేవా బృందం చరవాణి నంబరును పలు వ్యాపార సంస్థల వద్ద ప్రకటన ద్వారా అందుబాటులో ఉంచారు. అలా మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి నిరుపేదలు ఉండే కాలనీలకు వెళ్లి వారికి అందిస్తున్నారు. ఇలా చేయడంలో తమకు ఎంతో సంతృప్తి ఉంటుందని ఈ బృంద సభ్యులు ఆనందంగా చెబుతున్నారు. వివేకానందుడు చూపిన బాటలో నడుస్తూ రాబోయే రోజుల్లో తమ సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరిస్తామని బృంద సభ్యులు చెబుతున్నారు.

ఇదీ చూడండి : ఏకశిలపై ఏకదంతుడు ఎక్కడున్నాడో మీకు తెలుసా?

New Delhi, Sep 12 (ANI): While addressing a press conference in Delhi on September 12, Jamiat Ulama-i-Hind general secretary Mahmood Madani said that the Muslim organisation has passed a resolution which stated that Kashmir is an "integral part of India". "We have passed a resolution today that Kashmir is an integral part of India. There will be no compromise with security and integrity of our country. India is our country and we stand by it. Pakistan is trying to project on the international forum that India Muslims are against India. We condemn this act of Pakistan."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.