ETV Bharat / state

ఇంటిలా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: యోగితా రాణా

ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు యోగితా రాణా సూచించారు. నాగర్​ కర్నూల్​ జిల్లా నల్లవెల్లి, గన్యాగుల గ్రామాల్లో ఆమె పర్యటించారు.

ఇంటిలా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: యోగితా రాణా
ఇంటిలా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: యోగితా రాణా
author img

By

Published : Feb 8, 2020, 8:40 PM IST

మహిళలు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లుగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు యోగితా రాణా సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందించాలన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా నల్లవెల్లి, గన్యాగుల గ్రామాల్లో పల్లె ప్రగతి లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు.

గ్రామంలోని రోడ్లు, మురికి కాల్వలు, నాటిన మొక్కలను ఆమె తనిఖీ చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్ వైర్లను, విరిగిన స్తంభాలను సరిచేశారా లేదా అంశాలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్, వైకుంఠధామం నిర్మాణాలను, నర్సరీలను, పరిశీలించారు.

ఇంటిలా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: యోగితా రాణా

ఇవీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.