ETV Bharat / state

Sheep felldown in canal: అసలే వరద.. ఆపై గొర్రెల మంద.. ఏమైందంటే.. - తెలంగాణ వార్తలు

వాగు దాటుతుండగా వరద ఒక్కసారిగా పెరిగింది. ఒక గొర్రె బావిలో పడితే.. మిగతావీ పడతాయన్న మాదిరి మూగజీవాలన్నీ ఆ వాగులో పడిపోయాయి. వరద ఉద్ధృతికి గొర్రెలు కొట్టుకుపోయాయి.

Dindi project
డిండిలో గొర్రెలు, వాగులో గొర్రెలు
author img

By

Published : Oct 11, 2021, 5:14 PM IST

Updated : Oct 11, 2021, 10:38 PM IST

ఒక గొర్రె బావిలో పడితే.. మిగతావీ పడతాయన్నది సామెత. సరిగ్గా అలాంటి ఘటనే నాగర్‌కర్నూల్‌ జిల్లా - నల్గొండ జిల్లా సరిహద్దుల్లో జరిగింది. అసలే వరద.. ఆపై గొర్రెల మంద.. ఇంకేముంది.. అన్నీ కలిసి వరదలో పడిపోయాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్యవారిపల్లె వద్ద డిండి వాగు దాటిస్తుండగా ఈ ఘటన జరిగింది. వరద ఉద్ధృతికి గొర్రెలు కొట్టుకుపోయాయి. స్థానికులు కొన్ని గొర్రెలను పట్టుకొని ఒడ్డుకు లాగారు. మరికొన్ని ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

వాగులో గొర్రెలు

ఇదీ చదవండి: విద్యాశాఖ కీలక నిర్ణయం.. పదో తరగతిలో ఈ ఏడాది 6 పరీక్షలే..

Last Updated : Oct 11, 2021, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.