ETV Bharat / state

పుర ఎన్నికల్లో మొదలైన నామినేషన్ల పర్వం

పుర ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలికలో తొలిరోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Process of nominations beginning in Pura elections
పుర ఎన్నికల్లో మొదలైన నామినేషన్ల పర్వం
author img

By

Published : Apr 17, 2021, 11:27 AM IST

పుర ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం మొదలవడం వల్ల... నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలికలో తొలిరోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 14వ వార్డు నుంచి గార్లపాటి శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు. ఈయనను కాంగ్రెస్ పార్టీ ఇది వరకే ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది.

18వ వార్డుకు శివ, 2వ వార్డుకు సుంకరి నిర్మల, 20వ వార్డుకు రమేశ్‌ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియను డీఎస్పీ నర్సింహులు పరిశీలించారు. కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అందరూ పాటించాలని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలో మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

ఇదీ చదవండి: లైవ్ అప్​డేట్స్: కొవిడ్ నిబంధనల మధ్య సాగర్ పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.