ETV Bharat / state

'సర్దార్​ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి' - సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​

సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ విగ్రహం ధ్వంసానికి నిరసనగా... నాగర్​కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో గౌడ్​ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

'సర్దార్​ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి'
author img

By

Published : Oct 3, 2019, 6:08 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్​ దగ్గర రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్​ సర్వాయి పాపన్న గౌడ్​ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు వారు ఆరోపించారు. త్వరలో విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా... ఇలా జరగడం దారుణమన్నారు. నిజాం రాజు ఆగడాలను అడ్డుకున్న వీరుడు పాపన్న గౌడ్​ అని కొనియాడారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తామన్న పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.

'సర్దార్​ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి'

ఇదీ చూడండి: ఆర్టీసీ నాయకులతో సోమేశ్​కుమార్ కమిటీ చర్చలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.