ETV Bharat / state

ఈసెట్ లో సత్తా చాటిన నాగర్ కర్నూల్ వాసి

ఈసెట్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ వాసి సత్తాచాటాడు. జిల్లా కేంద్రానికి చెందిన కోయిలకొండ సాయిప్రణీత్... కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు.

ఈసెట్ లో సత్తా చాటిన నాగర్ కర్నూల్ వాసి
ఈసెట్ లో సత్తా చాటిన నాగర్ కర్నూల్ వాసి
author img

By

Published : Sep 11, 2020, 10:06 PM IST

జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు విడుదల చేసిన టీఎస్ ఈసెట్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన కోయిలకొండ సాయిప్రణీత్ సత్తాచాటాడు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. 2016 సంవత్సరంలో నిర్వహించిన పాలిటెక్నిక్ పరీక్షల్లో 1,112 ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్ లోని రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్​లో డిప్లొమా పూర్తి చేశాడు.

చదువుల్లో రాణించాలనే ఉద్దేశంతో కరోనా సెలవులు వృథా చేయకుండా రోజుకు పది గంటలు చదివి సత్తా చాటాడు. విద్యార్థి తండ్రి విజయ్ కుమార్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒప్పంద ఉద్యోగి. తల్లి కమలమ్మ గృహిణి. కుమారుడు రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

సాయి ప్రణీత్ కు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రావడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్​ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.