ETV Bharat / state

RS PRAVEEN KUMAR: బహుజనుల పాలన తీసుకు రావడమే లక్ష్యం: ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ - రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు పాలకులు కావాలనే లక్ష్యంతో బీఎస్పీ పోరాడుతుందని బహుజన సమాజ్​వాదీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్ఘాటించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ పదిహేనో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సామాజిక పరివర్తన సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎన్నికల సమయంలోనే దళిత బంధు, ఉద్యోగాల భర్తీ గుర్తుకొస్తాయని విమర్శించారు.

RS PRAVEEN KUMAR
RS PRAVEEN KUMAR
author img

By

Published : Oct 10, 2021, 5:09 AM IST

రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే ముఖ్యమంత్రికి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ఉద్యోగ నియామకాలు గుర్తుకొస్తాయని బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ వర్ధంతి సందర్భంగా నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన సభలో ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో గడీల పాలనకు చరమగీతం పాడి బహుజన పాలన తీసుకురావాలన్నారు. ప్రాజెక్టుల పేరిట భూములు తీసుకుని నిర్వాసితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఈటలను ఓడించేందుకు వేలకోట్ల ప్రజాధనం ఖర్చుచేస్తున్నారని ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు.

ఈటల రాజేందర్ మతోన్మాద భాజపాను వీడి వేరే పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల పేరుతో కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల భూములను ప్రభుత్వం హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల పేరుతో బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటేసి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: rs praveen kumar: ఆ నిధులన్నీ హుజూరాబాద్ ఉప ఎన్నికకే మళ్లిస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.