రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆకలి దీక్షలో భాగంగా ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు నాగర్కర్నూల్ పట్టణంలోని గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం ఒక్కరోజు ఆకలి దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు రామకృష్ణయ్య పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వర్గాల ప్రజలకు ఆర్థికసాయం అందించింది కానీ.... ప్రైవేట్ అధ్యాపకులు, ఉపాధ్యాయులకు మాత్రం ఎటువంటి సాయం అందించలేదని అన్నారు. మూడు నెలలుగా యాజమాన్యాలు ఎలాంటి జీతాలు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులను రాష్ట్రం ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.