నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో రామాపురం గ్రామానికి చెందిన కుమ్మరి కురుమయ్య అనే రైతు తన సొంత పొలంలో వరిధాన్యం పండించాడు. పెంటవెల్లిలోని ఓ రైస్ మిల్లులో 20 సంచుల వడ్లను బియ్యంగా మార్చుకోవడానికి వెళ్లాడు. 16 సంచుల బియ్యాన్ని తీసుకురాగా... ఇవాళ వంట కోసం తీస్తే అందులో ప్లాస్టిక్ బియ్యం రావడం గమనించాడు. తాము సొంతంగా పండించిన పంటలోనూ కల్తీ చేయడమేంటని యజమానిని నిలదీస్తే తనకు తెలియదన్నాడని రైతు వాపోయాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని... మిల్లు యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కురుమయ్య డిమాండ్ చేశాడు.
ఇదీ చదవండిః బరువు తగ్గించినందుకు 8 వారాల జైలు