ETV Bharat / state

'ఈనాడు, ఈటీవీ భారత్ కథనానికి స్పందన'

తల్లిదండ్రులను కోల్పోయి దీన స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లలు... చదువుపై మమకారంతో దాతల సాయం అర్థించారు. వారి పరిస్థితిని ' మేము చదువుకుంటాం ..మాకు సాయం చేయండి' శీర్షికతో ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితమైంది. పిల్లల కష్టాన్ని చూసిన దాతలు ముందుకొచ్చి వారికి సాయం చేశారు.

'ఈనాడు ఈటీవీ భారత్ కథనానికి స్పందన'
'ఈనాడు ఈటీవీ భారత్ కథనానికి స్పందన'
author img

By

Published : Mar 5, 2021, 2:31 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కయి పల్లికి చెందిన అలివేల, బిచ్చన్న అనారోగ్యంతో మృతి చెందారు. వారికి శివ శంకర్, జోత్స్న పిల్లలు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారుల కష్టంపై ఈటీవీ భారత్​ 'మేము చదువుకుంటాం ..మాకు సాయం చేయండి' శీర్షికతో కథనం ప్రచురితమైంది.

చిన్నారుల పరిస్థితిని చూసిన ఆంధ్రప్రదేశ్​లోని ప్యూర్ సంస్థ స్పందించి... శివశంకర్​,జోత్స్న కు పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, 2 జతల దుస్తులు, ఆన్​లైన్​ తరగతుల కోసం చరవాణి అందించారు. జోత్స్న కల్వకుర్తి గురుకుల పాఠశాలలో ఐదోతరగతి చదువుతుండగా... శివశంకర్​ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. చిన్నారులకు అండగా నిలిచిన ప్యూర్​ సంస్థను పలువురు అభినందించారు.
ఇదీ చూడండి: 'మేం చదువుకుంటాం.. మాకు సాయం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.