ETV Bharat / state

'మేం చదువుకుంటాం.. మాకు సాయం చేయండి'

తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లల బతుకు అగమ్యగోచరంగా తయారయింది. అనాథలుగా మారిన ఆ చిన్నారులు బంధువుల ఇంట్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. నా అనే వారు లేకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ఆదుకుని తమ భవిష్యత్ సాఫీగా సాగేందుకు ఆర్థిక తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఆ పసివారు.

orphans from nagarkurnool district are requesting government to help them in education
'మేం చదువుకుంటాం.. మాకు సాయం చేయండి'
author img

By

Published : Jan 23, 2021, 5:19 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చుక్కాయిపల్లికి చెందిన చాకలి అలివేలు, బిచ్చన్నలకు కుమారుడు శివశంకర్, కుమార్తె జ్యోత్స్న ఉన్నారు. ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లిన ఆ కుటుంబంలో.. తల్లి అలివేలు అనారోగ్యంతో మృతి చెందింది. భార్య మరణంతో నగరంలో ఉండలేక.. పిల్లలతో సహా స్వగ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్న బిచ్చన్న కూడా అనారోగ్యంతో ఇటీవలే మరణించాడు.

తల్లిదండ్రుల మరణంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. నాలుగో తరగతి పూర్తి చేసిన జ్యోత్స్న గురుకుల పరీక్షలో ప్రతిభ కనబర్చి కల్వకుర్తి పాఠశాలలో సీటు సాధించింది. వరసకు అమ్మమ్మ అయిన సరోజమ్మ ఇంట్లో ఉంటూ కొల్లపూర్​లో ఆరో తరగతి చదువుతున్నాడు శివశంకర్. వారి ఆలనాపాలనా చూసుకునే తల్లిదండ్రులు మృతి చెందడం వల్ల ఆ చిన్నారుల భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం స్పందించి తమ భవిష్యత్ సాఫీగా సాగేందుకు తగిన తోడ్పాటునందించాలని ఆ పిల్లలు వేడుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.