కొవిడ్ నిబంధనలను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని నారాయణపేట డీఎస్పీ మధుసూదన్‌రావు సూచించారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ముస్లిం మతపెద్దలతో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని డీఎస్పీ సూచించారు. వేడుకల్లో కరోనా నిబంధనలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సై చంద్రమోహన్‌తో పాటు ముస్లిం మత పెద్దలు నవాజ్ మూస, అమీరుద్దీన్, సలీమ్, తఖీ చాంద్, రెహమాన్‌లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది?