ETV Bharat / state

అట్టహాసంగా నాగర్​కర్నూల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం - తెలంగాణ వార్తలు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రికెట్ పోటీల్లో 19 జట్లు పాల్గొంటాయని... మూడు రోజుల పాటు డే అండ్ నైట్ మ్యాచ్​ నిర్వహిస్తామని తెలిపారు. కలెక్టర్ బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే బ్యాట్​తో కొట్టి అలరించారు.

nagarkurnool-premier-league-inaugurated-by-mla-marri-janardhan-reddy-and-collector-sharman-chauhan
అట్టహాసంగా నాగర్​కర్నూల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం
author img

By

Published : Jan 23, 2021, 2:22 PM IST

అట్టహాసంగా నాగర్​కర్నూల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీరం దృఢంగా ఉండడానికి ఎంతో తోడ్పడుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో స్థానిక జడ్పీ గ్రౌండ్​లో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను జడ్పీ ఛైర్​పర్సన్ పెద్దపల్లి పద్మావతి, కలెక్టర్ శర్మన్ చౌహన్​తో కలిసి ప్రారంభించారు.

ఈ క్రికెట్ పోటీల్లో 19 జట్లు పాల్గొంటాయని... మూడు రోజుల పాటు డే అండ్ నైట్ మ్యాచ్​ నిర్వహిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ క్రికెట్ పోటీల్లో పోలీస్, పొలిటికల్, ప్రెస్, రెవెన్యూ, డాక్టర్స్, అడ్వకేట్, యూత్, అగ్రికల్చర్, టీఎన్జీవోస్ ఇలా నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం 19 జట్లు ఆడనున్నాయని తెలిపారు.

ఫోర్ కొట్టిన కలెక్టర్

కలెక్టర్ బౌలింగ్ చేయగా ఎమ్మెల్యే మర్రి బ్యాట్​తో కొట్టారు. ఎస్పీ సాయి శేఖర్ బంతిని వేయగా కలెక్టర్ ఫోర్ కొట్టి అలరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సాయి శేఖర్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, 19 జట్లకు సంబంధించిన కెప్టెన్లు, జట్టు సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆహార భద్రత కార్డు.. పేదలకు అందని ద్రాక్షేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.