నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి ప్యాకేజీ పనులను జిల్లా కలెక్టర్ శర్మన్, ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ప్రాజెక్టు కోసం ఇంకా 83 ఎకరాల భూమి అవసరమున్న నేపథ్యంలో... భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారులు పరిశీలించారు.
భూమి అవసరం ఉన్న చోట మ్యాప్ ద్వారా పరిశీలించారు. మార్చి వరకు 83 ఎకరాలు భూమిని సేకరించి... ప్రభుత్వానికి అప్పజెప్పాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దీనికి రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం ప్రాజెక్టు ఆవరణలో జిల్లా కలెక్టర్, అధికారులు మొక్కలు నాటారు.
ఇదీ చూడండి: కోటి వృక్షార్చనలో కేటీఆర్ ఫ్యామిలీ