ETV Bharat / state

భూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రెవెన్యూ దర్బార్

నాగర్​కర్నూల్​ మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రెవెన్యూ దర్బార్​ నిర్వహించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

భూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రెవెన్యూ దర్బార్
author img

By

Published : Jul 15, 2019, 7:19 PM IST

రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నాగర్​కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవిన్యూ దర్బార్ నిర్వహించారు. అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి భూతగాదాలు పరిష్కరించాలన్నారు. కోర్టు కేసులు, అన్నదమ్ముల మధ్య వివాదాలున్న భూములు తప్ప మిగతా అన్ని ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

భూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రెవెన్యూ దర్బార్

ఇదీ చూడండి: 'అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి'

TG_MBNR_12_15_MLA_REVENUE_DARBAR_AVB_TS10050 CENTRE:-NAGARKURNOOL CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN CELLNO:-9885989452 ( )రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.నాగర్ కర్నూల్ మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణ లో రెవిన్యూ దర్బార్ నిర్వహించారు.ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల్లో భరోసా నింపడం కోసమే రెవిన్యూ దర్బార ను నిర్వహించడం జరుగుతుందన్నారు. నాగర్ కర్నూల్ మండలం లో మొత్తం రెవెన్యూ ఖాతాలు 21,000 ఉన్నాయి. అందులో 18,000 ఖాతా లు పూర్తయ్యాయి.1400 ఖాతాలు పెండింగులో వున్నాయి.మిగతావి నాన్ అగ్రికల్చర్ లాండ్ లో ఉన్నాయి. వాటిని పరిష్కరించండానికి ఈ రెవెన్యూ దర్బార్ రెవెన్యూ అధికారులు కలిసి మెలిసి పనిచేస్తూ భూముల సమస్యలను పరిష్కరించాలన్నారు వీఆర్వోలు పనిచేయకుంటే చర్యలు తీసుకుంటామన్నారు . గ్రామాలలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను VRO లు వెంటనే పరిష్కరించాలి. ప్రజలు నూతన పాస్ పుస్తకాలు రాకపోవడం తమ పొలాలు కంప్యూటరీకరణ కాకపోవడం ఒకరి భూమి మరొకరికి పట్టా కావడం ఇలాంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారి పోతున్నామని తమ గోడును ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఈ పరిస్థితి మారాలని ఇకపై రైతులను ఇబ్బంది పెట్టవద్దని, సమస్యలు తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రైతులను తిప్పు కుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సంబంధ సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేసిన సహించరని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి రైతుల భూ సమస్యలు పరిష్కరించాలన్నారు.కోర్ట్ కేసులు,అన్నదమ్ముల పంచాయతీ ఉన్న భూములు తప్ప మిగతా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం.టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే పాటు పడుతుందని, రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి తన విధానాలను మార్చుకున్నారని ఈ విషయాన్ని గుర్తుంచుకొని అధికారులు ప్రవర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,జెడ్పిటిసి శ్రీశైలం,MRO,రెవెన్యూ సిబ్బంది,,సర్పంచులు,ఎంపీటీసీలు,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. Byte : ఎమ్మెల్యే మర్రిజనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.