జిల్లాలో రెండు కోట్ల నలభై లక్షలు మొక్కలు నాటాలని అధికారులకు కలెక్టర్ శ్రీధర్ నిర్దేశించారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి ప్రభుత్వ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. వర్షాలు పడిన వెంటనే నర్సరీల్లోని మొక్కలను గ్రామాలకు తరలించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్క ఎదిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!