నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అదనపు కలెక్టర్ మనూ చౌదరి పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. పట్టణంలోని ఖాళీ ప్రదేశాలు, గ్రంథాలయం వద్దనున్న మద్యం దుకాణాలు, వివిధ మార్కెట్ పరిసరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పట్టణాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించినట్టు వివరించారు.
నూతనంగా ఏర్పడిన కాలనీల్లోని పార్కుల అభివృద్ధి కార్యక్రమాల గురించి మున్సిపల్ ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎడ్మ సత్యం, వైస్ ఛైర్మన్ షాహిద్, కమిషనర్ జాకీర్ అహ్మద్, ఎక్సైజ్ సీఐ శంకర్, పీఏసీఎస్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం