ETV Bharat / state

అక్రమంగా నిర్మించిన భవనాన్ని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు - Authorities prevented unauthorized construction

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి నిర్మించిన భవనంపై అధికారులు కొరడా ఝులిపించారు. భవనాన్ని సీజ్ చేయడంతో పాటుగా.. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Authorities prevented unauthorized construction
అనుమతులు లేని భవన నిర్మాణాన్ని అడ్డుకున్న అధికారులు
author img

By

Published : May 20, 2021, 3:53 PM IST

నాగర్​ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టిన భవనాన్ని పురపాలిక అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమించింనందుకు మున్సిపల్ చట్టం- 2019లోని సెక్షన్ 181 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపై అక్కడ ఎలాంటి నిర్మాణపనులు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలోని కొల్లాపూర్ పరిధి ఎన్టీఆర్ చౌరస్తాలో కొందరు ఆంజనేయులు గౌడ్ పేరిట భవనాన్ని నిర్మించారు. సదరు నిర్మాణానికి మూడు అంతస్తుల వరకు మాత్రమే అనుమతులుండగా వాటిని విస్మరించిన నిర్మాణదారులు ఆరు అంతస్తుల వరకు కొనసాగించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు నిబంధనలు అతిక్రమించినందుకు భవనాన్ని సీజ్ చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.