ఉమ్మడి మహబూబ్ నగర్లో జిల్లాలో పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల పర్వం ముగిసింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా కోఆప్షన్ సభ్యులను తెరాస ఏకగ్రీవంగా గెలుచుకుంది.
మహబూబ్నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్గా బూత్పూర్ జడ్పీటీసీ, మాజీ శాసన సభ్యురాలు స్వర్ణ సుధాకర్, ఉపాధ్యక్షునిగా గొల్లపల్లి యాదయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా అన్వర్ హుస్సేన్, అల్లవుద్దీన్ మహ్మద్ ఎన్నికయ్యారు.
నారాయణపేట జిల్లా పరిషత్ ఛైర్మన్ గా మక్తల్ జడ్పీటీసీ వనజమ్మ, వైస్ ఛైర్ పర్సన్ గా సరోజను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోఆప్షన్ సభ్యులుగా వాహిద్, తాజుద్దీన్ ఏకగ్రీవమయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా తెలకపల్లి జడ్పీటీసీ పెద్దపల్లి పద్మావతి, వైస్ ఛైర్మన్ గా బాలాజీ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కో ఆప్షన్ సభ్యులుగా అబ్దుల్ హమీద్, మతిన్ ఆహ్మద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా.. జిల్లా పరిషత్ ఛైర్మన్ గా మానవపాడు జడ్పీటీసీ సరిత, వైస్ ఛైర్మన్ గా సరోజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వనపర్తి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్గా లోకనాథ్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా వామన్ గౌడ్ ఎన్నికయ్యారు.
ఇవీ చూడండి: 32 జడ్పీ స్థానాల్లో జెండా ఎగురవేసిన తెరాస