ETV Bharat / state

పాలమూరు రైతంటే మీకు చిన్నచూపా? - భూనిర్వాసితులు

పాలమూరు రైతులంటే ప్రభుత్వానికి చిన్నచూపని మండిపడ్డారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. నాగర్​కర్నూల్ జిల్లా వట్టెం రిజర్వాయర్ భూనిర్వాసితులు పరిహారం కోసం ఆరు రోజులుగా చేస్తున్న ఆందోళనకు ఆయన సంఘీభావం ప్రకటించారు.

రైతంటే మీకు చిన్నచూపా
author img

By

Published : May 12, 2019, 7:36 PM IST

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళనకు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. నాగర్​కర్నూలు జిల్లాలో వట్టెం జలాశయంలో భూములు కోల్పోతున్న వారు ఆరు రోజులుగా ఆందోళన బాట పట్టారు. పనులు నిర్వహిస్తున్న కంపెనీ ముందు టెంట్ వేసుకుని బైఠాయించారు. భూములు, ఇళ్లు కోల్పోతున్న తమకు సరైన పరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ.. పనులను అడ్డుకున్నారు.

ధర్నా చేపట్టిన భూనిర్వాసితులకు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మద్దతుగా నిలిచారు. జిల్లాలోని ఈ విలువైన భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే లాక్కున్నారని నాగం ఆరోపించారు. మహబూబ్​నగర్ జిల్లా రైతులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై కోర్టుకు వెళితే ప్రాజెక్టులకు అడ్డంగా కేసులు వేస్తున్నారని తప్పుడు ఆరోపణలు తనపై చేస్తున్నారన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇచ్చిన విధంగా వీరికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పోతిరెడ్డిపల్లి వద్ద జరిగే రిజర్వాయర్ పనులను నాగం పరిశీలించారు.

రైతంటే మీకు చిన్నచూపా

ఇవీ చూడండి: ఆటిజం పిల్లలకు ఆమె అమ్మ

Intro:TG_MBNR_4_12_VATTEM_BHOONIRVASITHULU_NAGAM_VISIT_AVB_C8
CENTRE:-NAGARKIRNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ లో భూములు, ఇండ్లు కోల్పోతున్న భూనిర్వాసితులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి సంఘీభావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వట్టెం వెంకటాద్రి జలాశయంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులు ఆరు రోజులుగా ఆందోళన బాట పట్టారు. పనులు నిర్వహిస్తున్న కంపెనీ ముందు పనులు జరగకుండా టెంట్ వేసుకుని బైఠాయించారు. భూములు ఇండ్లు కోల్పోతున్న తమకు సరైన నష్టపరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ ఆ పనులను అడ్డుకున్నారు. ఆందోళన చేపట్టిన భూనిర్వాసితులకు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మద్దతుగా నిలిచారు. వారికి సంఘీభావం తెలిపారు. జిల్లాలోని ఈ విలువైన భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే భూములు లాక్కున్నారని నాగం ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా రైతులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టు లో జరుగుతున్న అవినీతిపై కోర్టుకు వెళితే ప్రాజెక్టులకు అడ్డంగా కేసులు వేస్తున్నారని తప్పుడు ఆరోపణలు తనపై చేస్తున్నారని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఏ విధంగా పరిహారం చెల్లించారు అదేవిధంగా చెల్లించే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తానని తమకు మద్దతుగా నిలుస్తారని ఆయన తెలిపారు. అనంతరం పోతిరెడ్డిపల్లి వద్ద జరిగే రిజర్వాయర్ పనులను నాగం పరిశీలించారు.రిజర్వాయర్ పనులలో నాణ్యత లోపించిందని రాళ్లతో నల్లమట్టి ఉపయోగించకుండా చౌడు మట్టితో పనులు నిర్వహిస్తున్నారని దీంతో నాణ్యత లోపించి రిజర్వాయర్ కు ముప్పు వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలాగే కొనసాగిస్తే పెద్ద ఎత్తున ధర్నా చేస్తానని హెచ్చరించారు....AVB

Body:TG_MBNR_4_12_VATTEM_BHOONIRVASITHULU_NAGAM_VISIT_AVB_C8

Conclusion:TG_MBNR_4_12_VATTEM_BHOONIRVASITHULU_NAGAM_VISIT_AVB_C8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.