నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చౌటబెట్లలో కుక్కల దాడిలో దుప్పి మృతి చెందింది. అడవి నుంచి గ్రామ సమీపంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేసి... మెడ భాగంలో తీవ్రంగా గాయ పరిచాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు కొనఊపిరితో ఉన్న దుప్పిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... మార్గ మధ్యలోనే మృతి చెందింది. శవపరీక్ష అనంతరం దుప్పిని దహనం చేశారు.
ఇవీ చూడండి: నిర్మల్ జిల్లా సింగన్గాంవ్లో యువకుని హత్య?