తెరాస ప్రభుత్వం నిరుద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో భాజపా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జరిగింది. ఉద్యోగాల భర్తీ పేరుతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేశామని మాటలు చెప్పడం కాకుండా... చేసి చూపించాలని హితవు పలికారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్టు రామచందర్ రావు స్పష్టం చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. ఈ సమావేశానికి భాజపా జిల్లా అధ్యక్షుడు ఎలేని సుధాకర్ రావు, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల