పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్ జూపల్లి రఘుపతిరావు, మార్కెట్ యార్డు ఛైర్మెన్ నరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- తప్పిపోయాడనుకుంటే నెదర్లాండ్స్లో ప్రత్యక్షమయ్యాడు..!