గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు పంట నష్టం కలిగి అతలాకుతలమైన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చారు. నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. తాడూర్ మండలంలోని లచ్చిరాం తండా, యాదిరెడ్డి పల్లి, ఎగంపల్లి, ఆకునెల్లికుదురు, మేడిపూర్, అల్లపూర్ గ్రామాల్లో పర్యటించి.. నష్టపోయిన పంటలను పరిశీలించారు.
రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకున్నారు. కాలువులు, చెరువుల వద్ద బైక్‌పై తిరుగుతూ వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరద నీటిలో మునిగిన పత్తి, వరి పంటలను చూశారు. పంట నష్టంపై అధికారులు నివేదిక తయారుచేస్తున్నారని.. వారందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మర్రి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండిః శంకర్‌పల్లిలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం