నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. కూరగాయలు అమ్మే రైతులకు మాస్కులను పంపిణీ చేశారు.
కూరగాయలు ఎలా అమ్ముతున్నారు... ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అని వారిని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అమ్మాలని విక్రయదారులను కోరారు. కరోనా కారణంగా... భౌతిక దూరం, మాస్కులను తప్పనిసరిగా వాడాలని సూచించారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దని ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిపారు.
ఇవీ చూడండి: మే 7 తర్వాత కరీంనగర్ కరోనా ఫ్రీ జోన్ : మంత్రి గంగుల