ETV Bharat / state

కరోనా రోగులకు గుడ్డు, చికెన్​లతో ఎమ్మెల్యే నిత్యాన్నదానం

author img

By

Published : May 16, 2021, 5:44 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రతిరోజూ మూడుపూటలా గుడ్డు, చికెన్​లతో కూడిన ఆహారాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. ఈ నిత్యాన్నదాన ప్రక్రియను ఈ రోజు నుంచే ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

mla marri janardhan reddy distributed meals to corona victims
గుడ్డు, చికెన్​లతో ఎమ్మెల్యే నిత్యాన్నదానం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కలెక్టర్ శర్మన్​లు పరామర్శించారు. బాధితులతో కాసేపు ముచ్చటించారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆక్సిజన్ సిలిండర్​లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఎంజేఆర్​ ట్రస్ట్ నుంచి 20 ఆక్సిజన్ సిలిండర్​లను ఉచితంగా పంపిణీ చేస్తామని వైద్యాధికారులకు మాట ఇచ్చారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు అందజేస్తున్న భోజనం గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రోటీన్​లతో కూడిన మెరుగైన ఆహారం అందట్లేదని తెలుసుకున్న మర్రి జనార్దన్ రెడ్డి... వెంటనే చికెన్​, గుడ్లతో కూడిన ఆహారాన్ని తెప్పించి రోగులకు అందజేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులందరికీ ప్రతిరోజు మూడు పూటలా గుడ్డు, చికెన్​లాంటి ప్రోటీన్​లతో కూడిన ఆహారాన్నిఉచితంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ అన్నదాన ప్రక్రియ నేటి నుంచే ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.