యేసు క్రీస్తు చూపిన ప్రేమ, దయ, అనురాగం, ఆప్యాయతతో ప్రతి ఒక్కరూ మెలగాలని... ఇదే అన్ని మతాల సారాంశమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... క్రైస్తవులకు క్రిస్మస్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసే క్రిస్మస్ కానుకలను ఆయన అందజేశారు.
యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు. మనుషులకు ఒకరిపట్ల ఒకరికి సేవా, సహాయం చేసే దయాగుణం కలిగి ఉండాలన్నారు. నిరుపేదలు కూడా పండుగలను సంతోషాలతో జరుపుకోవడమే కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశమని... అందుకే క్రిస్మస్, రంజాన్, దసరా పండుగలకు సర్కార్ కానుకలను అందిస్తోందని తెలిపారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు 72 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఇదీ చూడండి: ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో ఘనంగా మినీ క్రిస్మస్