నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ రైతు వేదికను రూ. 22 లక్షలతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతులకు సబ్సిడీ రూపంలో ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు ఇవ్వడానికి సేవా కేంద్రం ఉపయోగపడుతుందని.. ఈ అవకాశాన్ని అన్నదాతలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల సమస్యలను తీర్చేందుకు రైతు వేదికలను నిర్మిస్తున్నట్లు మర్రి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి: కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు నిర్ణయించిన వైద్యశాఖ