ETV Bharat / state

జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే మర్రి - mla marri janardan reddy latest news

ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి తన నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

mla marri janardan participated in a programme at bijinapalli
జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే మర్రి
author img

By

Published : Mar 4, 2021, 10:01 AM IST

నాగర్​కర్నూల్​ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఆనందగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎడ్లు బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు.

ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఈ బ్రహ్మోత్సవాలను ఊరంతా కలిసికట్టుగా జరుపుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెంకటేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం తన క్యాంపు కార్యాలయంలో అజ్మీర్ షరీఫ్​కు చాదర్ సమర్పించారు. రాష్ట్రంతో పాటు జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని అజ్మీర్ షరీఫ్ ఖాజా గరీబ్​ నవాజ్​ దర్గాలో ప్రార్థించాలని ఆయన కోరారు. ముస్లింల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

mla marri janardan participated in a programme at bijinapalli
చాధర్​ సమర్పించిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి: గల్ఫ్​లో తగ్గుతున్న ఉపాధి... లక్షల మంది ఇంటి ముఖం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.