విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో.. మూడురోజుల జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనను విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శనను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ప్రారంభించారు. జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి, స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి, జేసీ శ్రీనివాసరెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు.
విద్యార్థులు వచ్చిన అతిథులకు తాము ఏర్పాటు చేసిన ప్రయోగాల గురించి వివరించారు. చిన్నతనం నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం సాధించేవరకు పోరాడాలని... అప్పుడే ఆ రంగంలో ప్రావీణ్యం పొందుతామని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. . విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకర్షించాయి.
ఇవీ చూడండి: ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మేధావులే: శ్రీనివాస్ గౌడ్