నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రజలకు ఎంజేఆర్ ట్రస్ ఏర్పాటు చేసిన కషాయ పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. కరోనా కాలంలో ప్రజలు రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం అని అందుకే ఈ ఉచిత కషాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
దీన్ని ప్రజలు అందరూ సద్వినియోగించుకోవాలన్నారు. నియోజక వర్గంలో కొవిడ్ బారినపడిన బాధితుల కోసం తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా రూ. 2000 విలువగల ఐసొలేషన్ కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఎంజేఆర్ వాలంటీర్లు నేరుగా బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి వాటిని అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!