తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకక ప్రజలు ఏడుస్తుంటే... అధికారుల నిర్లక్ష్యంతో ఎన్నో వేల లీటర్ల నీరు వృథాగా పోతోంది. నాగర్ కర్నూలు జిల్లా కొండూరు గ్రామం వద్ద మిషన్ భగీరథ పైప్లైన్లు పగిలి ఫౌంటైన్ని తలపించింది. రోజూ తాగునీటి కోసం ఎంతో దూరం నడిస్తున్నామని ఇలా నీరు వృథాగా పోతుంటే చాలా బాధగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. పైపులైన్లు పగిలాయని అధికారులకు విన్నవించినా స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోవడం చూడలేని కొందరు గ్రామస్థులు పంటపొలాలకు నీటిని వదులుకున్నారు.
ఇవీ చదవండి: 'విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి'