ETV Bharat / state

శివ భక్తుల సేవలో వెల్లివిరిసిన మత సామరస్యం

ముస్లింలు మత సామరస్యాన్ని చాటుకున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాది మంది శివభక్తులు కాలినడకన శ్రీగిరులకు చేరుకుంటారు. వారికి సేవలందించేందుకు నాగర్​ కర్నూల్​ జిల్లాకేంద్రంలో సవేరా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్​ ఏర్పాటు చేసిన వెద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శర్మన్ ప్రారంభించారు.

shiva
shiva
author img

By

Published : Mar 7, 2021, 5:15 PM IST

Updated : Mar 7, 2021, 6:32 PM IST

శ్రీశైలం కాలినడకన వెళ్లే భక్తులకు సేవలందించేందుకు సవేరా మైనారిటీ వెల్ఫేర్​ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న శివస్వాములకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శర్మన్ ప్రారంభించారు. పాదయాత్రగా వెళ్తున్న శివ స్వాములకు జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ వైద్య పరీక్షలు చేశారు.

శివ స్వాములకు పండ్లు, పండ్లరసం, మెడికల్​ కిట్లను జిల్లా పాలనాధికారి అందజేశారు. ముస్లిం మైనారిటీలు వైద్య శిబిరాలు నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. ఇలాంటి వాటితో హిందూ, ముస్లింల మధ్య మమతానురాగాలు పెరిగి ఐక్యతా బలపడుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

minority welfare association started medical camp for devotees of srisailam in nagar kurnool district
శివ భక్తుల సేవలో వెల్లివిరిసిన మత సామరస్యం

ఇదీ చూడండి: కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు: బండి

Last Updated : Mar 7, 2021, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.