ETV Bharat / state

ఉద్యోగాల భర్తీపై విపక్షాల ఆరోపణలు అర్థరహితం: మంత్రి - తెలంగాణ వార్తలు

ఫిబ్రవరిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. కొందరు అవగాహన రాహిత్యంతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగర్​కర్నూల్​ జిల్లాలో మంత్రి శ్రీనివాసగౌడ్​తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

nagarkurnool news
ఉద్యోగాల భర్తీపై వారిది అవగాహన రాహిత్యం: మంత్రి నిరంజన్​రెడ్డి
author img

By

Published : Dec 30, 2020, 9:36 PM IST

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడం సహా అన్ని కులవృత్తులను ఆదుకున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. తెల్కపల్లి, నాగర్ కర్నూలు పట్టణంలోని ఉయ్యాలవాడ వద్ద ఆబ్కారీ సర్కిల్​ కార్యాలయాలు, బిజినపల్లి మండలం పాలెంలో రైతు వేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దామోదర్​రెడ్డి, జడ్పీ ఛైర్​ పర్సన్​ పెద్దపల్లి పద్మావతి, శాసనసభ్యుడు మర్రి జనార్దన్​రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కలెక్టర్ ఎల్​.శర్మన్ చౌహాన్​ పాల్గొన్నారు.

తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కిందని మంత్రి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న సుమారు 70 వేల ఉద్యోగాలను ఫిబ్రవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొందరు అవగాహన లేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

గుడుంబా రహిత తెలంగాణగా మారిందని మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు​. నీరా పాలసీని ప్రవేశ పెట్టి.. కుల వృత్తులను ప్రోత్సహించినట్లు తెలిపారు.

ఉద్యోగాల భర్తీపై వారిది అవగాహన రాహిత్యం: మంత్రి నిరంజన్​రెడ్డి

ఇవీచూడండి: కోనప్ప... బాగా చేస్తున్నావయ్యా: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.