ఎస్సీ వర్గీకరణతోనే అన్ని ఉప కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మంగళవారం స్థానిక దుకాణాల సముదాయాల ఆవరణలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలు జరుపుకున్నారు.
జనాభా ఆధారంగా ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరికీ సమ న్యాయం జరుగుతుందని నాయకులు తెలిపారు. విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:ప్రైవేట్లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్