ETV Bharat / state

స్పిన్నింగ్ మిల్లుల సంక్షోభం.. జీతాలు లేక కార్మికుల అవస్థలు - ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో స్పిన్నింగ్ మిల్లుల సంక్షోభం

కరోనా నేపథ్యంలో పారిశ్రామిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా స్పిన్నింగ్ మిల్లులు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి. తయారైన వేల టన్నుల దారం గోదాముల్లో పేరుకుపోవడం.. కొనే దిక్కులేక ఆదాయం రాకపోవడం వల్ల పరిశ్రమల నిర్వహణ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు నిర్వాహకులు.

lockdown effect on spinning mills in joint mahabubnagar district
స్పిన్నింగ్ మిల్లుల సంక్షోభం.. జీతాలు లేక కార్మికుల అవస్థలు
author img

By

Published : Jun 13, 2020, 11:53 PM IST

స్పిన్నింగ్ మిల్లుల సంక్షోభం.. జీతాలు లేక కార్మికుల అవస్థలు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని స్పిన్నింగ్​ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉత్పత్తిని కొనేవారు లేక.. పరిశ్రమల నిర్వహణ భారంగా మారుతోంది. కార్మికులకు జీతాలూ ఇవ్వలేని స్థితిలో పరిశ్రమను నిర్వహించాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు నిర్వాహకులు.

నాగర్​ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కేంద్రంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో సుమారు 2 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ ఇదే ఆధారం. కరోనా పుణ్యమా అని ప్రస్తుతం ఈ మిల్లు సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 2 వేల టన్నుల ఉత్పత్తి గోడౌన్​లో మూలుగుతోంది. ఉత్పత్తిని అమ్మితేనే పరిశ్రమకు ఆదాయం. ఆదాయం లేదంటే పరిశ్రమను నిర్వహించం భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం మిల్లును నడపాలా, వద్దా అనే సందిగ్ధంలో పడింది.

40 శాతం ఉత్పత్తి మాత్రమే..

లాక్​డౌన్ వల్ల వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడం వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రస్తుతం 40 శాతం ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దారాన్ని తయారు చేసినా.. కొనుగోళ్లు జరుగుతాయో, లేదో తెలియని సందిగ్ధంలో నిర్వాహకులూ ఉత్పత్తిని తగ్గించారు. కరోనా ప్రభావం ఇలాగే కొనసాగితే మిల్లులు నడిచే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మిల్లులు నడిచినా, నడవకపోయినా పరిశ్రమ నిర్వహణ, కార్మికులు, ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు వంటివి చెల్లించడం తప్పడం లేదు. ఫలితంగా ఇవి పరిశ్రమలకు భారంగా మారుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి.. స్పిన్నింగ్ మిల్లుల సమస్యలపై దృష్టి సారించాలని యాజమాన్యాలు, కార్మికులు కోరుతున్నారు.

కొనేవాళ్లు లేకే ఈ పరిస్థితి..

ఇదివరకు స్పిన్నింగ్​ మిల్లుల్లో తయారైన దారాన్ని విదేశాలకు ఎగుమతి చేసేవారు. దేశీయంగా భీవండి, ఇచ్చల్​ కరంజీ, భీల్వాడా, లుధియానా, అమృత్​సర్, తిరుపూర్, తణుకు లాంటి పట్టణాల్లో వస్త్ర తయారీ పరిశ్రమలకు అమ్మేవారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటం, అక్కడి వస్త్ర తయారీ పరిశ్రమలు తెరచుకోకపోవడం వల్ల దారాన్ని కొనేవాళ్లు కరువయ్యారు. ఫలితంగా స్పిన్నింగ్ మిల్లుల ఆదాయం పూర్తిగా పడిపోయింది. నిర్వహణ భారంగా మారింది.

ఇదీచూడండి: గచ్చిబౌలి కరోనా ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలి: చాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.