నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేటలో బుధవారం రాత్రి జరిగిన దాడిలో తీవ్రగాయాలపాలైన భాజపా ఎంపీటీసీ అభ్యర్థి వరలక్ష్మిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహబూబ్నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రిలో వరలక్ష్మి చికిత్స పొందుతున్నారు.
అనంతరం దేవరకద్ర మండలం డోకూరులో బుధవారం తెల్లవారుజామున హత్యకు గురైన భాజపా కార్యకర్త ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రేమ్ కుమార్ హత్యను తీవ్రంగా ఖండించారు. తెరాస ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకే ఈ దారుణానికి ఒడిగట్టారని నిప్పులు చెరిగారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఒక్కరు మిగిలారు... విలీనమే తరువాయి...