నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదనరావు అనారోగ్యంతో మృతి చెందారు. కొల్లాపూర్ మండలం నార్లపూర్కు చెందిన మధుసూదనరావు... 1994 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. తెదేపా నుంచి అత్యధికంగా 33 వేల మెజార్టీతో గెలుపొందారు. మొదటగా మధుసూదన రావు 1989లో క్రాంతి యువసేన పార్టీ తరఫున పోటీ చేయగా... ఓటమి చెందారు.
అనంతరం 1994లో కాంగ్రెస్ అభ్యర్థిపై 33వేల మెజార్టీతో గెలుపొందారు. మధుసూదన రావు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేవారని.. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయామని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విభజనకు నిర్ణయం: ప్రశాంత్ రెడ్డి