ETV Bharat / state

వచ్చేనెల 15న కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు ప్రారంభం?

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్​హౌజ్​ మోటార్లను వచ్చేనెల 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పంప్​హౌజ్​లో నీటి తొలగింపు ప్రక్రియ రేపటిలోగా కావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Kalwakurthi pump house motors expected to start next month
వచ్చేనెల 15 కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు ప్రారంభం?
author img

By

Published : Oct 29, 2020, 8:06 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్​హౌజ్ మోటార్లను వచ్చేనెల 15న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. నీటమునిగిన పంప్​హౌజ్​ మోటార్ల వద్ద నీటి తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. రేపటిలోగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా , ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి అక్కడకు చేరుకోనున్నారు. నీటిని పూర్తిగా తొలగించాక నిర్ణీత ప్రోటోకాల్ ప్రకారం మోటార్లను సిద్ధం చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్​కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్ పంప్​హౌజ్​పై బుధవారం సమావేశంలో చర్చించారు.

ఇదీ చూడండి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నత్తనడకన రైతు వేదికల నిర్మాణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.