నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి తన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశీ ఇటిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. నాగర్ కర్నూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కేంద్రం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నా.. రాష్ట్రానికి వేల కోట్లు నష్టం వాటిల్లుతున్నా.. రైతులకు ఎలాంటి కష్టం కలగకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఆయన అన్నారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎవరూ అధైర్య పడవద్దని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలను సన్మానించారు. 50 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఇదీ చూడండి: జమున హేచరీస్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు